డిస్కౌంట్ల ఎఫెక్ట్ : హీరో లాభాలు డౌన్

10 May, 2017 20:17 IST|Sakshi
డిస్కౌంట్ల ఎఫెక్ట్ : హీరో లాభాలు డౌన్
దేశీయ అతిపెద్ద టూ-వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కు బీఎస్-3 వాహనాల డిస్కౌంట్ల దెబ్బ బాగానే కొట్టింది. బుధవారం కంపెనీ వెల్లడించిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో హీరో మోటార్ కార్ప్ నికర లాభాలు 13.9 శాతం పడిపోయి రూ.717.75 కోట్లగా నమోదయ్యాయి. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టూవీలర్స్ కు మందగించిన డిమాండ్, బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పుతో తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్లతో లాభాలకు గండికొట్టినట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.833.29 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. నిర్వహణల నుంచి వచ్చే మొత్తం ఆదాయం కూడా 7.7 శాతం పడిపోయి రూ.7488.08 కోట్లగా రికార్డైనట్టు తెలిపింది. మొత్తం వ్యయాలు కూడా కంపెనీవి 5.3 శాతం పడిపోయాయి. క్వార్టర్ రివ్యూలో కంపెనీ సేల్స్ వాల్యుమ్ 5.8 శాతం క్షీణించింది. 
 
కంపెనీ ముందటేడాది క్వార్టర్ లో 17,21,240 టూవీలర్స్ ను విక్రయిస్తే, ఇవి మార్చి క్వార్టర్ లో 16,21,805గానే నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 66,64,240 యూనిట్ల విక్రయాలు చేపట్టినట్టు తెలిసింది. ఇవి 2015-16 స్వల్పంగా పెరుగుదల అని హీరో మోటోకార్ప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజల్ తెలిపారు.  2016-17లో గ్లోబల్ మార్కెట్లో కొన్ని కీలక  ఇన్ రోడ్లను ఏర్పాటుచేసుకున్నామని, అర్జెంటీనా, నైజీరియాల్లో తమ వాహనాలను లాంచ్ చేసినట్టు చెప్పారు. బంగ్లాదేశ్ లో 2017-18లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 21018-19లో రూ.2500 కోట్లను కొత్త ప్రొడక్ట్ డెవలప్ మెంట్ కోసం పెట్టుబడులు పెట్టనున్నామని, దానిలో భాగంగా గుజరాత్ లో దశల వారీగా సామర్థ్యం పెంపు, ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ లో అప్ కమింగ్ ప్లాంట్లు ఏర్పాటుచేయబోతున్నట్టు ముంజల్ తెలిపారు. 
>
మరిన్ని వార్తలు