ట్రిపుల్‌ తలాక్‌పై రేపటి నుంచే వాదనలు | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ తలాక్‌పై రేపటి నుంచే వాదనలు

Published Wed, May 10 2017 8:06 PM

ట్రిపుల్‌ తలాక్‌పై రేపటి నుంచే వాదనలు - Sakshi

న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, ట్రిపుల్‌ తలాక్‌, నిఖా హలాలావంటి వాటి రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నుంచి వాదనలు ప్రారంభించనుంది. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధానం తమ సామాజిక వర్గంలో విపరీతంగా పెరిగిపోతోందని ఐదుగురు ముస్లిం మహిళలతో సహా మొత్తం ఏడుగురు పిటిషన్లు దాఖలు చేశారు.

చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం వీటిపై వాదనలను విననుంది. ఈ ధర్మాసనంలో హిందు, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్‌, సిక్కు మతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. సున్నితమైన ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు వేసవి సెలవుల్లో ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినాలని, శని, ఆదివారాల్లోనూ పనిచేయాలని కోర్టు నిర్ణయించుకుంది.

 

Advertisement
 
Advertisement