బీఎస్‌ఎన్‌ఎల్‌ దివాలీ స్వీట్‌

24 Oct, 2018 20:56 IST|Sakshi

సాక్షి, ముంబై: ఫెస్టివ్‌ సీజన్‌లో  దేశీయ ప్రధాన టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జియో దీపావళి బొనాంజా ప్రకటించగా ఇదే బాటలో ఇతర  కంపెనీలు కూడా పయనిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దివాలీ ఆఫర్‌ ప్రకటించింది. 

దీపావళి పండుగ సందర్భంగా   8.8శాతం టాక్‌ టైంను అదనంగా అందిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. వివిధ టాప్‌అప్‌లపై  ఈ అదనపు టాక్‌ టైంను ఆఫర్‌ చేస్తోంది.  ఆ ఆఫర్‌ 25 అక్టోబర్‌ నుంచి నవంబరు 15 దాకా మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.  కాగా జియో వార్షికప్లాన్‌కు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు