ఉద్యోగులకు తీపి కబురు

29 Jun, 2016 12:22 IST|Sakshi
ఉద్యోగులకు తీపి కబురు

న్యూఢిల్లీ: 7వ వేతన సంఘం సిఫారసులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగితేలనున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుపై  కేంద్రం మంత్రివర్గం ఉద్యోగులకు సానుకూలంగా  కీలక నిర్ణయం తీసుకుంది.  బుధవారం జరిగిన   మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై  ఆర్థిక మంత్రిత్వ శాఖ  రూపొందించిన నివేదికకు  మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.  అయితే  యథాతథంగా అమలు చేసిందా.. మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా అన్నది.. పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.   

 7వ వేతన సంఘం సిఫార్సులకనుగుణంగా జీతం, పెన్షన్, అలవెన్సుల్లో 23.55  శాతం పెరుగుదలను  యథాతథంగా అమలు  చేస్తే.. ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57 నుంచి 2.7కు పెరగనుంది. కొత్తగా చేరేవారి జీతం రూ.18,000 నుంచి రూ.23,000కు చేరనుంది. సుమారు 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తించే వేతనాల పెంపు వల్ల కేంద్రంపై సుమారు లక్ష కోట్ల ఆర్థిక భారం పడనుంది.
 

మరిన్ని వార్తలు