ట్రంప్‌పై ప్రతీకారం : బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లు

30 Jun, 2018 09:00 IST|Sakshi

అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన వ్యక్తం చేయడమే కాకుండా.. ట్రంప్‌పై ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నాయి. చైనా, భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో పాటు.. తాజాగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లను విధించింది. కెనడియన్‌ స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ కార్యాలయం విధించిన డ్యూటీలకు దెబ్బకు దెబ్బగా బిలియన్‌ డాలర్ల ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం శుక్రవారం సుంకాల విధించే ఉత్పత్తుల తుది జాబితాను విడుదదల చేసింది. జూలై 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొన్ని ఉత్పతుల పన్నులు 10 శాతం నుంచి 25 శాతమున్నాయి. ఇది తీవ్రతరం కాదు, అలా అని వెనక్కి తీసుకోలేం అని కెనడియన్‌ విదేశీ మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్‌ అన్నారు.

పన్నులు విధించిన ఉత్పత్తుల్లో కెచప్‌, గట్టి కోసే యంత్రాలు, మోటర్‌ బోట్స్‌ ఉన్నాయి. మొత్తంగా 12.6 బిలియన్‌ డాలర్లు సుంకాలను కెనడా అమెరికాపై విధించింది. ఇది డాలర్‌కు డాలర్‌ స్పందన అని ఫ్రీల్యాండ్‌ చెప్పారు. తమకు మరో దారి లేదన్నారు. చాలా అమెరికా ఉత్పత్తుల్లో ఆర్థిక సంబంధనమైన వాటితో పోలిస్తే రాజకీయపరమైనవే ఎక్కువగా ఉన్నాయి.  ఒకవేళ డొనాల్డ్‌ ట్రంప్‌ తమతో వాణిజ్య యుద్ధానికి తెరలేపితే, దానికి కూడా సిద్దమయ్యే ఉన్నామని హెచ్చరించారు. అయితే అ‍ల్యూమినియం, స్టీల్‌పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ట్రంప్‌, దిగుమతి చేసుకునే మెటల్స్‌ వల్ల అమెరికా దేశ రక్షణకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులు, ఆటో పార్ట్‌లపై విధించిన టారిఫ్‌లు కూడా దేశ రక్షణకు చెందిన టారిఫ్‌లని పేర్కొన్నారు. ఆటో పార్ట్‌లపై టారిఫ్‌లు విధించడంపై కెనడా ఎక్కువగా ఆందోళన చెందుతోంది. కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇవి ముఖ్యమైనవి. అమెరికాలో తయారయ్యే కార్ల విభాగాలను కెనడాలోనే తయారు చేస్తారు. వీటి ఫలితంగానే అమెరికా ఉత్పత్తులపై కెనడా బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా