మీకిష్టమైన ఉద్యోగం చేస్తారా?

29 Apr, 2017 00:52 IST|Sakshi
మీకిష్టమైన ఉద్యోగం చేస్తారా?

విద్యార్థి దశలోనే కెరీర్‌ ఎంచుకోవచ్చు
కోర్సులు, భవిష్యత్తు ఉద్యోగాలేంటో చెబుతాం
‘లోడ్‌స్టార్‌’ నుంచి కెరీర్‌ గైడెన్స్‌ సేవలు
100 మంది గైడెన్స్‌ నిపుణులతో ఒప్పందం
బెంగళూరు, హైదరాబాద్, మైసూర్‌లలో సేవలు

‘స్టార్టప్‌ డైరీ’తో లోడ్‌స్టార్‌ ఫౌండర్‌ మురళీధర్‌ ఎస్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  యూఎక్స్‌ డిజైనర్, యాచురీ, క్యూరేటర్, జెనిటీసిస్ట్, టాక్సికాలజిస్ట్, సోషల్‌ మీడియా అడ్వైజర్‌.. ఇవేవో కొత్త టెక్నాలజీ కోర్సులనుకునేరూ! కొత్త ఉద్యోగాలండి బాబూ!!ఇలా ఒకటా రెండా.. 260కి పైగా కొత్త ఉద్యోగాల జాబితాను సిద్ధం చేసింది లోడ్‌స్టార్‌. మరి ఆ ఉద్యోగాల్లో చేరాలంటే ఎలా? ఏం చదవాలి? వీటికి సమాధానమే లోడ్‌స్టార్‌ కెరీర్‌ గైడెన్స్‌ స్టార్టప్‌. విద్యార్థి దశలోనే కెరీర్‌ గైడెన్స్‌ అందిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలను లోడ్‌స్టార్‌ ఫౌండర్‌ సీఈఓ మురళీధర్‌.ఎస్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...

లోడ్‌స్టార్‌ గురించి చెప్పాలంటే ముందుగా తొలి స్టార్టప్‌ మెరిట్‌ట్రాక్‌ గురించి చెప్పాలి. కంపెనీలకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ అందించే సంస్థ. తర్వాత దీన్ని మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ కొనుగోలు చేసింది. ఓ సారి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లో ఎంపికైన ఉద్యోగులు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవటానికి ఓ సర్వే చేశాం. దాన్లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎంపికైన ఉద్యోగులు కొందరు.. ఆ తర్వాత అసలీ ఉద్యోగం తమకు కరెక్ట్‌ కాదని, కెరీర్‌ను తప్పుగా ఎంచుకున్నామని భావిస్తున్నారు. దీనిక్కారణం విద్యార్థి దశలోనే కెరీర్‌ ఎంపిక, చేయబోయే వృత్తిపై అవగాహన లేకపోవటమేనని తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాం.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ బదులు కెరీర్‌ గైడెన్స్‌ ఇస్తే సక్సెస్‌ అవుతామని! అలా 2015లో లోడ్‌స్టార్‌ స్టార్టప్‌ ప్రారంభమైంది. లోడ్‌స్టార్‌ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే 10వ తరగతి పూర్తయ్యే విద్యార్థులను ఎంపిక చేసి వారి ఆసక్తిని గుర్తించి.. సరైన కెరీర్‌ను ఎంపిక చేయటమే.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ సేవలు..
లోడ్‌స్టార్‌ అసెస్‌మెంట్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా ఉంటుంది. అంటే ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థి ఆసక్తులు, కెరీర్‌ అవగాహన వంటి వాటిపై ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తాం. ఫలితాలు, విద్యార్థి ఆసక్తిని బట్టి కెరీర్‌ ఆప్షన్లను వివరిస్తాం. ఆపై ఆఫ్‌లైన్‌లో నేరుగా నిపుణులు వద్దకు వెళ్లి ప్రవేశ పరీక్షలు, కళాశాల ఎంపిక, విద్యా విధానం, ట్యుటోరియల్‌ క్లాసుల వంటివి నిర్వహిస్తారు. ఇందుకోసం 100 మంది కెరీర్‌ గైడెన్స్‌ నిపుణులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. హైదరాబాద్‌ నుంచి 15 మంది ఉన్నారు. త్వరలో మరో 50 మందిని నియమించుకుంటాం. మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ మాజీ సీఈఓ అండ్‌ ఎండీ ఆనంద్‌ సుదర్శన్, స్టాన్లీ బ్లాక్‌ అండ్‌ డెక్కర్‌ (ఇండియా) మాజీ ఎండీ సుబోధ్‌ జిందాల్, మెక్ఫీ మాజీ సీనియర్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కృష్ణమూర్తి వంటి వారు లోడ్‌స్టార్‌లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

260కి పైగా కెరీర్‌ ఆప్షన్స్‌.. ఫీజు రూ.4 వేలు
ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హైదరాబాద్‌ నగరాల్లో సేవలందిస్తున్నాం. విద్యార్థులకు 260కి పైగా కెరీర్‌ ఆప్షన్స్‌ను అందిస్తాం. ఒక్కో దాంట్లో 70కి పైగా పారామీటర్స్‌ ఉంటాయి. కెరీర్‌ అసెస్‌మెంట్‌ కోసం ఒక్కో విద్యార్థికి రూ.4 వేలు చార్జీ ఉంటుంది. కెరీర్‌ అసెస్‌మెంట్‌తో పాటూ 20 పేజీల సమగ్ర నివేదికనిస్తాం. దీంతో తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఏ కోర్సును ఎంచుకుంటే ఏ కెరీర్‌లో స్థిరపడతాడో అవగాహన వస్తుంది. 2 వేల మంది విద్యార్థులు ఇప్పటివరకూ మా సేవలను వినియోగించుకున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి 8 వేల మంది విద్యార్థులకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

రూ.26–30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
ప్రస్తుతానికి మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.6 కోట్ల నిధులను సమీకరించాం. జైకెన్‌ ఫండ్, మణిపాల్‌ గ్రూప్‌కు చెందిన ఆనంద్‌ సుదర్శన్, పలువురు హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి చెన్నై, కోయంబత్తూరులకు విస్తరించటంతో పాటు రూ.3 కోట్ల ఆదాయా న్ని లకి‡్ష్యంచాం. విస్తరణకు రూ.26–30 కోట్ల నిధుల సమీకరణ చేస్తున్నాం. వీసీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ముగింపులోగా డీల్‌ను క్లోజ్‌ చేస్తాం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రేడ్‌ వార్‌ భయాలు : పసిడి పరుగు

గుడ్‌న్యూస్‌ : 20 రోజుల్లో 20 స్మార్ట్‌ఫోన్లు ఫ్రీ

నష్టాలకు చెక్‌: భారీ లాభాలు

తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్‌!

350 పాయింట్లు జంప్‌ చేసిన స్టాక్‌మార్కెట్లు

సమోసా, కచోరీలతో కోట్లకు కొలువుతీరి..

మెహుల్‌ చోక్సీకి షాక్‌

64 మెగాపిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌

బడ్జెట్‌లో తీపి కబురు ఉండేనా..?

ఆధార్‌ ప్రింట్‌ చేసినట్టు కాదు..!

వివాదాల ‘విరాళ్‌’... గుడ్‌బై!

సగం ధరకే ఫ్యాషన్‌ దుస్తులు

1.76 లక్షల ఉద్యోగులకు మరోసారి షాక్‌!

బిన్నీబన్సల్‌ అనూహ్య నిర్ణయం 

చివరికి నష్టాలే..,

నష్టాల బాట : ఆటో, మెటల్‌ టౌన్‌

అమెరికా వర్సెస్‌ ఇండియా? కాదు కాదు..

మొబైల్‌ యాప్స్‌ నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఫార్మా ఫండ్‌

మిడ్‌క్యాప్‌లో లాభాల కోసం...

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ ప్రారంభం

‘కియా’ చౌకధర ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా

వరుణ దేవుడా... క్రికెట్‌ మ్యాచ్‌లకు అడ్డురాకు...!

గాల్లో ఎగిరే కారు వచ్చేసింది!

‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్‌!

ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్‌ పే

పీఎన్‌బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!