భారత్ నుంచి వైదొలగనున్న ఆర్‌బీఎస్

27 Feb, 2015 01:48 IST|Sakshi
భారత్ నుంచి వైదొలగనున్న ఆర్‌బీఎస్

లండన్: వరుసగా ఏడో సంవత్సరం నష్టాలు నమోదు చేసిన నేపథ్యంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్(ఆర్‌బీఎస్) తమ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణపై మరింత దృష్టి పెట్టింది. భారత్ సహా 24 దేశాల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోంది. భారత్‌లో కార్పొరేట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను విక్రయించాలని బ్యాంక్ భావిస్తున్నట్లు సమాచారం.

2007లో డచ్ బ్యాంక్ ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ కొనుగోలుతో సదరు బ్యాంక్ భారత కార్యకలాపాలు కూడా ఆర్‌బీఎస్‌కు దక్కాయి. అయితే, ఆ తర్వాత ఏడాది అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆర్‌బీఎస్‌పై కూడా పడింది. దీంతో అప్పటినుంచి క్రమక్రమంగా భారత్ సహా ఇతర దేశాల్లో కార్యకలాపాలను బ్యాంక్ తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం భారత్‌లోని 8 శాఖల్లో ఆర్‌బీఎస్‌కి 800 మంది, ఇతరత్రా బ్యాంక్ ఆఫీస్ కార్యకలాపాల్లో 10,000పైగా ఉద్యోగులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు