డిజిటల్‌ ఎకానమీతో 70 లక్షల ఉద్యోగావకాశాలు

16 Sep, 2017 01:18 IST|Sakshi
డిజిటల్‌ ఎకానమీతో 70 లక్షల ఉద్యోగావకాశాలు

ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌
గురుగ్రామ్‌:
దేశీయంగా డిజిటల్‌ ఎకానమీ ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దీనితో యువతకు 2020 నాటికి 50–70 లక్షల పైచిలుకు ఉద్యోగావకాశాలు లభించగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. దేశ ప్రజల అభివృద్ధికి టెక్నాలజీ కీలకమని, సాంకేతికత అందని ద్రాక్షలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌తో సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్‌ హర్యానా సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైబర్‌ సెక్యూరిటీ పాలసీని ఆయన స్వాగతించారు. పలు భారతీయ, అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలకు కేంద్రంగా ఉన్న హర్యానాకు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ తయారీ హబ్‌గా కూడా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు