డుకాటి సూపర్‌ బైక్స్‌ లాంచ్‌..ధరలు?

14 Jun, 2017 21:50 IST|Sakshi
డుకాటి సూపర్‌ బైక్స్‌ లాంచ్‌..ధరలు?

న్యూఢిల్లీ:  ఇటాలియన్ సూపర్బైర్‌ బైక్ మేకర్ డుకాటీ  రెండు కొత్త వేరియంట్‌  సూపర్‌  బైక్‌లను లాంచ​ చేసింది.  దేశవ్యాప్తంగా మాన్‌స్టర్‌ 797, మల్టిస్ట్రాడా 950 మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలను వరుసగా  రూ. 7.77 లక్షలు,  రూ. 12.6 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ప్రకటించింది.  ఈ ఏడాది కంపెనీ పరిచయం చేయనున్న అయిదింటి  మోడళ్లులో భాగంగా ఈ సూపర్‌ బైక్‌లను పరిచయం చేసింది.  కాగా దేశంలో మొత్తం 19 మోడళ్లను ఇప్పటికే  ప్రవేశపెట్టింది.  వచ్చే నెలలో బైక్ల డెలివరీ ప్రారంభమవుతుంది.

మాన్‌స్టార్‌ 797లో  టేకర్ బ్రేకింగ్ వ్యవస్థ, ఏబీఎస్‌ ,  ట్రాక్షన్ నియంత్రణల , ఎయిర్‌  కూల్డ్‌ 803  సీసీ ఇంజీన్‌తో రూపొందించింది. ఎల్‌ఈడీ లైట్స్‌,ఎల్‌సీడీ స్ర్కీన్‌ సహా ఇతర ఫీచర్లను జోడించింది.  మల్టిస్ట్రాడా 950లో   937 సీసీ ఇంజీన్‌ ను అమర్చింది. ఇది 113 హెచ్‌పీ గరిష్ట టార్క్‌ను  అందిస్తుంది.  వచ్చే నెలనుంచి వీటి డెలివరీ ని ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.  


భారతదేశంలో డుకాటీ ఉత్పత్తి శ్రేణి విస్తరణలో ఇది కీలకమైన చర్య అని,  ఈ మోడల్స్ ప్రారంభంతో, కంపెనీ ఇప్పుడు ధరల పరంగా పోటీ పడుతుందని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ విలేకరులతో అన్నారు. ఈ రెండు మోడళ్ళతో, భారతీయ పెద్ద బైక్ మార్కెట్,సంబంధిత విభాగాలలో తమ మార్కెట్ వాటాను వేగంగా పెంచుకోనున్నామని చెప్పారు. డుకాటీ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, కొచ్చిన్, అహ్మదాబాద్, పూణే, బెంగళూరులలో ఆరు డీలర్షిప్లను కలిగి ఉండగా  ఈ సంవత్సరం  కోల్‌కతా, చెన్నై ,  హైదరాబాద్‌లో మూడు డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.

భారతదేశంలో స్థానిక తయారీ పథకాలపై అవలూర్ మాట్లాడుతూ "ప్రస్తుతం తాము  ప్రధానంగా థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేస్తున్నామనీ, థాయ్‌లాండ్‌తో స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉండటం ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో విక్రయాల నెట్‌ వర్క్‌ అభివృద్ధి పై దృష్టిపెట్టనట్టు చెప్పారు.  


 

మరిన్ని వార్తలు