మరిన్ని నగరాలకు సర్వీసులు: ఎమిరేట్స్

17 Mar, 2016 00:57 IST|Sakshi
మరిన్ని నగరాలకు సర్వీసులు: ఎమిరేట్స్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న దుబాయ్ సంస్థ ఎమిరేట్స్.. భారత్‌లో మరిన్ని నగరాలకు విమానాలను నడుపనుంది. ప్రస్తుతం 10 నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. సీట్ల సామర్థ్యం పెంపు విషయంలో భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదరగానే విస్తరణ ప్రారంభిస్తామని ఎమిరేట్స్ పశ్చిమ ఆసియా, భారత వాణిజ్య కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖూరీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. కొత్త నగరాల్లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏ380 విమానాన్ని ముంబైకి మాత్రమే కంపెనీ నడుపుతోంది. ఒప్పందం పూర్తి అయితే ఢిల్లీ, హైదరాబాద్‌కు ఈ భారీ విహంగాన్ని  నడిపేందుకు వీలుందని చెప్పారు. ఎమిరేట్స్ ప్రస్తుతం దుబాయ్-భారత్ మధ్య వారానికి 185 సర్వీసులను అందిస్తోంది. సీట్ల సామర్థ్యం 65 వేలు.

30 శాతం పెరిగిన కంపెనీలు...
ఈ ఏడాది ఏవియేషన్ ప్రదర్శనకు అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చిందని మంత్రి చెప్పారు. ‘‘గత ఏవియేషన్ షోలతో పోలిస్తే పాల్గొనే కంపెనీల సంఖ్య 30% పెరిగింది. 25 దేశాల నుంచి 210కిపైగా కంపెనీలు, 29 విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి’’ అని తెలియజేశారు. రెండు దేశాలు, ఏడు రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న ఈ సదస్సులో ప్రపంచంలోని అన్ని విమాన తయారీ కంపెనీల ప్రతి నిధులూ పాల్గొన్నారని చెప్పారాయన. ‘‘విమానాల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే పలు ఒప్పందాలు జరిగాయి. ఈ సారి ఎక్కువగా నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. ఈ దిశగా కొత్త పాలసీలో పలు నిర్ణయాలు కూడా ప్రకటిస్తాం’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు