ఈక్విటీ ఫండ్స్లోకి జోరుగా పెట్టుబడులు

12 Dec, 2016 14:33 IST|Sakshi
ఈక్విటీ ఫండ్స్లోకి జోరుగా పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సలో గత నెలలో జోరుగా పెట్టుబడులు వచ్చారుు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆశావహంగా ఉండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సలోకి రూ.9,079 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్  ఫండ్‌‌స ఇన్ ఇండియా(యాంఫి) పేర్కొంది..  ఈక్విటీ, డెట్ మార్కెట్లలో సానుకూల, ఆశావహ పరిస్థితులు ఉండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సలోకి జోరుగా పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడం, జీఎస్‌టీ బిల్లు సజావుగా ఆమోదం పొందడం కూడా కలసివచ్చాయని వారంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్  ఫండ్‌‌స ఇన్ ఇండియా(యాంఫి) వెల్లడించిన గణాంకాల ప్రకారం.,

ఈక్విటీ లింక్డ్ సేవింగ్‌‌స స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)తో కూడిన ఈక్విటీ ఫండ్‌‌సలో గత నెలలో రూ.9,079 కోట్ల పెట్టుబడులు వచ్చారుు.

ఈక్విటీ స్కీమ్‌ల్లోకి పెట్టుబడులు రావడం ఇది వరుసగా ఎనిమిదో నెల.

అంతకు ముందు, అంటే ఈ ఏడాది మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సనుంచి రూ.1,370 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ ఫండ్‌‌సల్లోకి రూ.9,394 కోట్ల  పెట్టుబడులు వచ్చారుు. గత 16 నెలల్లో ఇవే అత్యధిక పెట్టుబడులు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సలోకి వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.40,706 కోట్లకు చేరారుు.

ఈ ఏడాది నవంబర్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌స నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్) రూ.4.68 లక్షల కోట్లకు పెరిగారుు.

మరిన్ని వార్తలు