మరిన్ని సంస్కరణలు తెస్తాం...

5 Sep, 2015 01:42 IST|Sakshi
మరిన్ని సంస్కరణలు తెస్తాం...

- వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాం...
- భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి: ఆర్థిక మంత్రి జైట్లీ
అంకారా (టర్కీ):
పన్నుల విధానాలు హేతుబద్ధంగా ఉండేలా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెడతామని, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్‌లో స్మార్ట్ సిటీలు, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు సందర్భంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ.. టర్కీ ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇన్‌ఫ్రాకు ఇంకా నిధులు కావాలి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషించగలరు’’ అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. టర్కీ నిర్మాణ రంగ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి, భారత్‌లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని జైట్లీ సూచించారు.

మరిన్ని వార్తలు