New Sim Card Rules: నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ.10 లక్షలు ఫైన్

1 Dec, 2023 14:10 IST|Sakshi

సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించిన డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నట్లు గత ఆగష్టు నెలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. దీని ప్రకారమే ఈ రోజు (23 డిసెంబర్ 1) నుంచి ఆ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం, పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్‌దారు ఒప్పందంపై సంతకం చేయాలి. నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది.

కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడు తప్పనిసరిగా వ్యక్తిగత వివరాలను అందించాలి. సిమ్ కార్డు అందించే ఏజెంట్ కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు క్యూఆర్ స్కాన్ చేసి వివరాలు సేకరిస్తాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి మరో విషయం ఏమిటంటే ఒక సిమ్ డిస్‌కనెక్ట్ అయిన 3 నెలలు లేదా 90 రోజుల తర్వాత కొత్త కస్టమర్‌కు ఆ మొబైల్ నెంబర్ కేటాయించాలి.

ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్

కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి, ఒక ఐడీ మీద గరిష్టంగా 9 సిమ్ కార్డులకంటే ఎక్కువ కొనుగోలు చేయకూడదు. అయితే కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ ఖాతాలకు ఈ నియమం వర్తించదు, కానీ ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చనే విషయం వెల్లడి కాలేదు.

మరిన్ని వార్తలు