యువతకు 'ఫోర్డ్' మంచి అవకాశం!

12 Apr, 2016 15:58 IST|Sakshi
యువతకు 'ఫోర్డ్' మంచి అవకాశం!

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రతిభగల టెక్నీషియన్లను దేశానికి అందించేందుకు మరో అడుగు వేసింది. మనేసర్ లో ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నైపుణ్యంగల టెక్నీషియన్ల సృష్టికి ప్రయత్నాలు ప్రారంభించింది. టెక్నికల్ ట్రైనింగ్ ఐఎన్ సీ (టీటీఐ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సాంకేతిక శిక్షణ సౌకర్యాన్ని ఫోర్డ్ కంపెనీ మానేసర్ లోని 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరింపజేసింది. ఏడాదికి 13,500 రోజులకు పైగా ప్రత్యేక సాంకేతిక శిక్షణ అందించనున్నట్లు ఫోర్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త సౌకర్యంలో నైపుణ్యంతోపాటు, నాణ్యమైన ఫోర్డ్ ఉత్పత్తులు వెలువడేందుకు దోహదపడుతుందని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు.

ఆధునిక సౌకర్యాలతో కూడిన స్వతంత్ర సాకేంతిక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, నాలుగు ప్రాంతాల్లో బాడీ షాప్ ట్రైనింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేయాలన్న ప్రత్యేక దృష్టితో మొట్టమొదటి అడుగు వేశామని మెహ్రోత్రా తెలిపారు.  ఫోర్డ్ ఇండియా ఇప్పటికే భారతదేశంలోని చెన్నై, కొచ్చిన్, కొల్హాపూర్, అహ్మదాబాద్, మొహాలీ, కోల్ కతా మొదలైన ఆరు నగరాల్లో శిక్షణా కేంద్రాలు కలిగి ఉందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు