త్వరలో హైదరాబాద్‌ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు

8 Jan, 2020 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు సేవలను అందిస్తున్న ప్రముఖ ట్రాన్స్‌పోర్టు సంస్థ గరుడవేగ.. తాజాగా హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లలో కూడా కొత్త బ్రాంచీలను ప్రారంభించనుంది. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్‌" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా ఉన్న పార్శిళ్లకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న బంధువులకు చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గరుడ వేగ ఓ ప్రకటనలో తెలిపింది.

అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, విదేశాల్లో తమవారికి దూరంగా ఉన్నప్పటికీ కానుకలు పంపించి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందన్న గరుడవేగ.. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సదుపాయాలను ఆఫర్ల రూపంలో అందించనుంది. ఈ సందర్భంగా వినియోగదారులకు కొత్త సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.

మరిన్ని వార్తలు