అల వైకుంఠపురంలో: బుట్టబొమ్మ అదిరిందిగా!

8 Jan, 2020 14:20 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈపాటికే విడుదలైన ట్రైలర్‌ మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌ వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇందులో బన్నీ, పూజా హెగ్డే కలిసి చేసిన స్టెప్పులు ఎంతో ముద్దొస్తున్నాయి. బుట్టబొమ్మలా ఉన్న పూజాను నిజంగానే బుట్టలో పడేశాడని తెలుస్తోంది. ఇక ఫాస్ట్‌ బీటే కాకుండా ఏ బీటైనా తన డ్యాన్స్‌తో ఇరగదీస్తానని బన్నీ మరోసారి నిరూపించాడు.


రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను సింగర్‌ అర్మన్‌ మాలిక్‌ ఆలపించాడు. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌ పూర్తి వీడియో ఎప్పుడెప్పుడు చూస్తామా అని బన్నీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం నిర్వహించిన మ్యూజికల్‌ కన్సర్ట్‌ కూడా బాగానే హిట్‌ అయింది. ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సంక్రాంతికి కోడిపందాల కన్నా కూడా బన్నీ ‘అల వైకుంఠపురంలో’, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మధ్య పోటీనే రసవత్తరంగా మారింది.

చదవండి:
అల్లు అర్జున్‌ భావోద్వేగం
భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరో అక్షయ్‌ కుమార్‌పై కేసు నమోదు

నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే: కంగనా

దీపికపై ట్రోలింగ్‌.. స్పందించిన కనిమొళి

దీపికకు థ్యాంక్స్‌: కంగన భావోద్వేగం

‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’

సినిమా

హీరో అక్షయ్‌ కుమార్‌పై కేసు నమోదు

నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే: కంగనా

దీపికకు థ్యాంక్స్‌: కంగన భావోద్వేగం

అల వైకుంఠపురంలో: బుట్టబొమ్మ అదిరిందిగా!

‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’

ఈ వీడియో ఇప్పుడు వార్తల్లో