రూ 40,000 దాటిన పసిడి

3 Jan, 2020 17:54 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో శుక్రవారం దేశీ మార్కెట్‌లో పసిడి పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 850 పెరిగి 40,115కు ఎగబాకింది. గత రెండు వారాలుగా బంగారం ధరలు పదిగ్రాములకు రూ 2000 మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం అంతకంతకూ భారమవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా పసిడి పరుగుకు కలిసివస్తోంది. మరోవైపు వెండి ధరలు సైతం మండిపోతున్నాయి. కిలో వెండి శుక్రవారం ఎంసీఎక్స్‌లో రూ 814 భారమై రూ 47,386కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1543 డాలర్లకు ఎగబాకింది.

మరిన్ని వార్తలు