భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!

3 Jan, 2020 17:58 IST|Sakshi

భారతీయ సంప్రదాయం ప్రకారం భర్త ముందు నడిస్తే అతడికి కాస్త వెనుకగా భార్య నడుస్తుంది. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. తాను సంప్రదాయక మహిళను అని అందరూ అంటుంటారు. మన దేశ సంప్రదాయం ప్రకారం భర్తకు రెండడుగులు వెనుకగా భార్య నడవాలన్నది దైవ నిర్ణయం. అందుకు బలమైన కారణం ఉంది. భర్త దారితప్పినా వెనకున్న భార్య సరిదిద్దే వీలుంటుంది. అతడు దారి తప్పినా అతడ్ని తిరిగి దారిలో పెట్టగల శక్తి స్త్రీకి ఉంటుంది. నా భర్త నాకు సహకరిస్తాడు. అతనికి నేను సహకరిస్తాను.

చదవండి: ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!

అందుకే ఆయన అడుగులో అడుగేసి రెండు అడుగులు వెనుకే నడుస్తాను అని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు.స్మృతి వ్యాఖ్యలకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2018లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా..ప్రస్తుతం స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై లాజికల్‌ థింకర్‌ అనే ట్టిటర్‌ పేజిలో కొన్ని టిక్‌టాక్‌ వీడియోలు సైతం వైరల్‌ అవుతున్నాయి.
చదవండి: మాయల్లేవ్‌..మంత్రాల్లేవ్‌..ప్రయత్నించానంతే!

మరిన్ని వార్తలు