దిగివచ్చిన పసిడి

5 Jun, 2020 14:42 IST|Sakshi

లాక్‌డౌన్‌ సడలింపులతో చిన్నబోయిన స్వర్ణం

సాక్షి, న్యూఢిల్లీ : పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్న పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపుల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు లాభపడగా బంగారం ధరలు దిగివచ్చాయి. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేయడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయనే అంచనాలతో పెట్టుబడి వనరుగా పసిడికి డిమాండ్‌ తగ్గింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రఃభుత్వాలు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి పలు చర్యలు ప్రకటిస్తుండటంతో బంగారం వన్నె తగ్గింది. మొత్తంమీద ఎంసీఎక్స్‌లో శుక్రవారం  పదిగ్రాముల బంగారం రూ 356 తగ్గి రూ 46,340కి దిగివచ్చింది. ఇక కిలో వెండి రూ 391 తగ్గడంతో రూ 48,420కి దిగివచ్చింది. చదవండి : వెండి.. బంగారాన్ని మించనుందా?

మరిన్ని వార్తలు