క్లీన్‌ కామెడీతో పార్టీ 

21 Nov, 2023 03:37 IST|Sakshi
రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర.

‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్‌ కామెడీతో ‘సౌండ్‌ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా సంజయ్‌ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. జయ శంకర్‌ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది.

రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్‌తో తెలుగులో ‘సౌండ్‌ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్‌ అయినా కామెడీ జానర్‌ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్‌లో 150కి పైగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు