పసిడి, వెండి ఎగిసిపాటుకు బ్రేక్

10 May, 2016 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ : పసిడి, వెండి ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. వరుసగా రెండో రోజూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.30వేల మార్కును నుంచి రూ.250 కిందకుజారి, రూ.29,850గా మంగళవారం బులియన్ మార్కెట్ లో నమోదైంది. అంతర్జాతీయంగా పసిడికి బలహీనమైన ట్రెండ్ కొనసాగడంతోపాటు ఈసారి వివాహాది శుభకార్యాలు ముగియడంతో జ్యువెల్లర్ల దగ్గర్నుంచి డిమాండ్ పడిపోయింది.  దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర కిందకి దిగొచ్చింది.

వెండి సైతం కిలోగ్రాముకు రూ.600 పడిపోయి, కేజీ రూ.40,600గా నమోదైంది. కాయిన్ తయారీదారుల నుంచి, పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోలు ఆసక్తి లేకపోవడంతో వెండి ధరలు కూడా నష్టాలపాలయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ కు 1.89శాతం పడిపోయి, 1,263.40 డాలర్లుగా న్యూయార్క్ లో నమోదైంది. సిల్వర్ సైతం 2.55 శాతం పతనమైంది.

>
మరిన్ని వార్తలు