త్వరలోనే డిలీట్‌.. మెటా,ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అలెర్ట్‌!

6 Dec, 2023 17:59 IST|Sakshi

ఫేస్‌బుక్‌ (మెటా) సరిగ్గా మూడేళ్ల క్రితం చాట్‌ ఇంటిగ్రేషన్‌ అని ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ఫీచర్‌ సాయంతో యూజర్లు ఫేస్‌బుక్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోని వారి స్నేహితులతో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మెటాలో సెట్టింగ్స్‌ మార్చాల్సి ఉంటుంది. అయితే తాజాగా, ఆ ఫీచర్‌ను డిసెంబర్‌ నెలలో డిలీట్‌ చేస్తున్నట్లు మెటా  ప్రకటించింది. 

మరి ఆఫీచర్‌ను ఎందుకు తొలగిస్తున్నారనే అంశంపై మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇటీవల యురేపియన్‌ యూనియన్‌కి చెందిన ప్రభుత్వ సంస్థ యూరోపియన్‌ కమిషన్‌ ‘యూరప్‌ డిజిటల్‌ మార్కెట్‌ యాక్ట్‌ (డీఎంఏ)’ లో కొన్ని మార్పులు చేసింది. 

వాటికి అనుగుణంగా ఆయా టెక్నాలజీ సంస్థలు మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య క్రాస్‌ చాటింగ్‌ సదుపాయం ఉండేలా చూడాలని కోరింది. ఈ సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.    

క్రాస్‌ చాటింగ్‌ సాదుపాయం లేకపోతే 
‘క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ను తొలిగిస్తే యూజర్ల మధ్య మెసేజ్‌ పంపుకునే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు వీడియో కాల్స్‌ చేసుకునే వీలుండదు’ అని మెటా తెలిపింది. ఇప్పటికే యూజర్ల మధ్య జరిగిన చాటింగ్‌లు రీడ్‌-ఓన్లీ మెసేజ్‌లుగా మారిపోనున్నాయి. అంతేకాదు క్రాస్‌ చాటింగ్‌కు సంబంధం ఉన్న మెటా అకౌంట్స్‌ను తొలగిస్తామని వెల్లడించింది. ఒకవేళ యూజర్లు చాటింగ్‌ చేసుకోవాలంటే మెటా అకౌంట్స్‌ లేదా మెసేంజర్‌ నుంచి చాటింగ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు