గచ్చు అందం రెట్టింపు..! 

19 Jan, 2019 00:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రానైట్, మార్బుల్‌ కొత్తలో ఇట్టే ఆకట్టుకుంటాయి. నిర్వహణలో శ్రద్ధ లేకపోతే గచ్చుపై మురికి పేరుకుపోయి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు వద్దనుకుంటే నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదు. మల్లెకన్నా తెల్లనిది మార్చుల్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత ప్రత్యేకత గత పాలరాతిని ఎంత ఇష్టంగా ఎంచుకుంటామో.. శుభ్రపరిచే విషయంలోనూ అంతే ఇష్టాన్ని కనబర్చాలి. 
ఠి ఫ్లోర్‌ మీద పడిన దుమ్ము, ధూళిని ఎప్పుడూ మెత్తని గుడ్డతో తుడవాలి. నీళ్లతో కడగాలనిపిస్తే గోరువెచ్చని నీటిని వాడండి. ఈ నీటిలో తక్కువ శక్తిగల డిటర్జెంట్‌ పౌడర్లను వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ వేడి గల నీటిని వినియోగించవద్దు. మరకల్ని తొలగించేందుకు పదునైన సాధనాలను వాడరాదు. ఠి నేలను కడిగాక మెత్తటి పేపర్‌ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది. మార్కెట్‌లో నాణ్యమైన మార్బుల్‌ క్లీనర్లు దొరకుతున్నాయి. ధర తక్కువని నాసిరకం క్లీనర్లను వాడితే ఖరీదైన మార్బుల్‌ వెలవెలబోతుంది. ఠి మార్బుల్‌ కాంతులు వెలసిపోవద్దనుకుంటే కాఫీ, టీ వంటి ఇతరత్రా ద్రవ పదార్థాలను నేల మీద పడకుండా జాగ్రత్త పడితే మంచిది. 

నిత్యం మెరవాలంటే.. 
గట్టిదనానికి మారుపేరు గ్రానైట్‌. నిర్వహణ కూడా సులువే. ఈ ఫ్లోరింగ్‌ ఎప్పటికప్పుడు మెరిసిపోతూ ఉండాలంటే..  పాత్రలను తోమే డిటర్జెంట్‌ పౌడరును కలిపి గోరు వెచ్చని నీటితో ప్రతిరోజు కడిగి మెత్తటి బట్టతో తుడిస్తే గ్రానైట్‌ ఫ్లోర్‌ తళతళమెరుస్తుంది. ఠి వంట గదిలో కూరగాయలు, తదితరాలను కోసేందుకు గ్రానైట్‌ ఐల్యాండ్‌ను వాడొద్దు. అలాచేస్తే గీతలు పడి అసహ్యంగా కనిపిస్తుంది. ఠి గ్రానైట్‌ను కడిగే నీటిలో నాసిరకం డిటర్జెంట్‌ పౌడర్లను వాడొద్దు. అవి గ్రానైట్‌ను కాంతి విహీనం చేస్తాయి. ఠి మార్కెట్‌లో స్టోన్‌ పాలిష్‌ లభిస్తున్నాయి. వీటితో అప్పుడప్పుడు ఫ్లోర్‌ను పాలిష్‌ చేయించండి. 

మరిన్ని వార్తలు