ఐ-వాచ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు

3 Jul, 2015 00:09 IST|Sakshi
ఐ-వాచ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే తొలిసారిగా ఐ-వాచ్‌లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరికీ డిజిటల్ బ్యాకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో యాపిల్ వాచీ ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది. దేశంలో వేరబుల్ మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో తొలుత యాపిల్ వాచీలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వేరబుల్స్‌లో కూడా బ్యాంకింగ్ సేవలను తీసురానున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ తెలిపారు.

ప్రారంభంలో ఐవాచ్ ద్వారా కేవలం 10 బ్యాంకింగ్ సేవలను మాత్ర మే అందుబాటులోకి తెచ్చామని, రానున్న కాలం లో మరిన్ని సేవలను తీసుకురానున్నట్లు ఆయన తెలి పారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ ఆన్‌లైన్ నెట్ బ్యాం కింగ్‌లో 150, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 80 బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఐ-వాచ్‌లో బ్యాంకింగ్ సేవల కోసం మొబైల్ బ్యాంక్‌కు కోసం అభివృద్ధి చేసిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుందని నితిన్ చుగ్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు