ఫండ్స్‌ కొత్త పథకాల జోరు

20 Nov, 2023 00:53 IST|Sakshi

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 48 కొత్త పథకాలు

రూ.22,000 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో నూతన పథకాలు (ఎన్‌ఎఫ్‌వో) సెపె్టంబర్‌ త్రైమాసికంలో పెద్ద మొత్తంలో నిధుల సమీకరించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 48 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కలసి ఇన్వెస్టర్ల నుంచి రూ.22,049 కోట్ల నిధులను సమీకరించాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 25 కొత్త పథకాలు రాగా, అవి వసూలు చేసిన మొత్తం రూ.5,539 కోట్లుగానే ఉంది. దీంతో పోలిస్తే సెపె్టంబర్‌లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. సాధారణంగా మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు, బుల్లిష్‌ సెంటిమెంట్‌ను అనుకూలంగా భావించి ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి.

మరిన్ని వార్తలు