ఎన్పీఎస్పై కార్పొరేట్లు దృష్టి పెట్టాలి

19 Nov, 2016 01:10 IST|Sakshi
ఎన్పీఎస్పై కార్పొరేట్లు దృష్టి పెట్టాలి

పీఎఫ్‌ఆర్‌డీఏ సీజీఎం దాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగులకు జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) ప్రయోజనాలను అందించే దిశగా దీనిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చీఫ్ జనరల్ మేనేజర్ అనంత గోపాల్ దాస్ సూచించారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్ చందాదారుల సంఖ్య 1.4 కోట్ల మేర ఉండగా, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 1.5 లక్షల కోట్ల స్థారుులో ఉందని ఆయన వివరించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, తెలంగాణ .. ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంస్థల సమాఖ్య ఎఫ్‌టీఏపీసీసీఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ సంయుక్తంగా శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు చక్రగతిన దాదాపు 10-12.5 శాతం మేర రాబడులు ఇస్తున్నాయని, వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రిటైర్మెంట్ అవసరాలకు కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు ఇది అత్యంత అనువైనదని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌పీఎస్ ఐచ్ఛికమే అరుునప్పటికీ.. ఇటు కంపెనీలకు ఇది అటు ఉద్యోగులకు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా అందిస్తుందని తెలిపారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలు, బాండ్లు, ప్రభుత్వ సెక్యురిటీలతో పాటు తాజాగా ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌‌సలో (ఏఐఎఫ్) కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కల్పించినట్లు దాస్ పేర్కొన్నారు. దీనిపై అవగాహన కల్పించే క్రమంలో వివిధ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. త్వరలో సూరత్, భోపాల్ మొదలైన ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నామని ఆయన వివరించారు.

మరోవైపు, ప్రస్తుతం దేశ జనాభాలో యువత సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. కొన్నేళ్ల తర్వాత రిటైర్మెంట్ అయ్యేవారి సంఖ్య గణనీయంగా ఉండగలదని ఫిక్కీ తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ దేవేంద్ర సురానా పేర్కొన్నారు. ఎఫ్‌టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ, వే2వెల్త్ బ్రోకర్స్ పెన్షన్ అసెట్స్ విభాగం హెడ్ ప్రసాద్ పాటిల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

 స్వల్పంగా తగ్గిన ఆర్‌సీఎఫ్ లాభం
న్యూఢిల్లీ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్‌సీఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.43 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.46 కోట్ల నికర లాభం సాధించామని ఆర్‌సీఎఫ్ పేర్కొంది. గత క్యూ2లో రూ.2,403 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో రూ.1,772 కోట్లకు తగ్గిందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు