ఫేస్‌బుక్‌లో కొత్త యాప్‌

15 Feb, 2020 15:24 IST|Sakshi

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త యాప్‌ను విడుదల చేసింది. హాబీ  (Hobbi) పేరుతో వచ్చిన ఈ యాప్‌ పిన్‌రెస్ట్‌కు కాపీ లాంటిదే. అంటే హాబీ యాప్‌లో కూడా యూజర్లు మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనకు ఇష్టమైన గార్డెనింగ్, వంట, ఆర్ట్స్, డెకరేషన్ ఇలాంటి హాబీలను ఓ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. తమ కలెక్షన్లు, ప్రాజెక్టులను ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ తోడ్పడుతుందని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ కలెక్షన్లు, ప్రాజెక్టులను వాటిని వీడియోగా క్రియేట్‌ చేసుకుని మరికొందరు యూజర్లతో షేర్ చేసుకోవచ్చు.

కాగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దీన్ని విడుదల చేసింది ఫేస్‌బుక్‌. అలాగే ప్రస్తుతానికి ఇది కేవలం ఆపిల్‌ ఐఫోన్లు,  ఐప్యాడ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.  ఆండ్రాయిడ్‌లో కానీ, గూగుల్‌ ప్లే స్టోర్‌లో గానీ అందుబాటులో లేదు. త్వరలోనే అన్ని దేశాల వారికి అందుబాటులోకి రానుందని..ఆండ్రాయిడ్‌ యాప్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  ఫేస్‌బుక్ కంపెనీలో భాగమైన న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ (ఎన్ పీఈ) టీమ్ ఆధ్వర్యంలో ఈ  హాబీ యాప్ రూపొందింది. అయితే ఈ యాప్‌ను పెద్దగా ప్రచారం లేకుండా విడుదల చేయడం విశేషం. 

మరిన్ని వార్తలు