ఫేస్‌బుక్‌ యాడ్స్‌లో ఫేక్‌ లోన్‌యాప్స్‌ నమ్మి మోసపోవద్దని

6 Nov, 2023 05:24 IST|Sakshi

సైబర్‌ భద్రత నిపుణుల హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ మోసాలకు తెర­తీసేందుకు సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్‌ లోన్‌ యాప్‌లను ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ రూపంలో పంపుతున్నట్లు సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వచ్చే ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌ వినియోగదారులను టార్గెట్‌ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్‌కార్డు, పాన్‌­కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్‌లైన్‌ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు