ఎల్‌ఐసీ-ఐడీబీఐ డీల్‌కు ఐఆర్‌డీఐ గ్రీన్‌ సిగ్నల్‌

29 Jun, 2018 18:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్‌వర్గాల్లో  ఆసక్తిని రేపిన ఎల్‌ఐసీ​‍- ఐబీడీఐ బ్యాంకు డీల్‌ను కీలకమైన ఆమోదం లభించింది.  ఐడీబీఐ బ్యాంకులో వాటాల కొనుగోలుకు సంబంధించిన డీల్‌లో ఎల్ఐసీకి   ఐడీబీఐ  గ్రీన​   సిగ్నల్‌ ఇచ్చింది.   డీల్‌లో భాగంగా బ్యాంక్‌లోకి ఎల్‌ఐసీ దాదాపు రూ. 13వేల కోట్లను పెట్టుబడులు పెట్టనుంది. బ్యాంకులో వాటాను 5-7 సంవత్సరాలలో 15 శాతానికి పరిమితం చేయనుంది. సెబీ నిబంధనల ప్రకారం వాల్యూయేషన్స్‌ నిర్ణయించబడతాయి. మరోవైపు ఐడీబీఐ  బ్యాంకులో మెజారిటీ  వాటాను  ఎల్‌ఐసీ కొనుగోలు వార్తలతో ఇవాల్టి బుల్‌  మార్కెట్‌లో  ఐడీబీఐ షేర్‌ భారీగా లాభపడింది.  ఇన్వెసర్ల కొనుగోళ్లతో 10శాతానికిపైగా ఎగిసింది.  దీంతో బ్యాంకు మార్కెట్‌ వాల్యూ 7వేలకోట్ల రూపాయలు పుంజుకుని రూ. 23వేల  కోట‍్లకు చేరింది.

>
మరిన్ని వార్తలు