Sakshi News home page

బరువెక్కిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి - నేటి ధరలు ఇలా ఉన్నాయి

Published Sat, Dec 23 2023 3:11 PM

Gold And Silver Price Details - Sakshi

దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలు, ఈ రోజు కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,200 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 63190గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 260 పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేసినట్లు సమాచారం. నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5875 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6409గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58750, రూ. 64090గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 540పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: 2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు

తెలుగు రాష్ట్రాల మాదిరిగానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5835 కాగా, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 6364గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58350, రూ. 63640గా ఉంది.

వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా గత కొన్ని రోజులుగా క్రమంగా పెరిగినప్పటికీ.. నేడు మాత్రం ఒక కేజీ మీద రూ. 500 తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో వెండి ధరలు ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టాయి.

Advertisement

What’s your opinion

Advertisement