అదరగొట్టిన ఐటీసీ

19 Jan, 2018 14:42 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఎఫ్‌ఎంసీజీ దిగ‍్గంజం ఫలితాల్లో అదరగొట్టింది.  డిసెంబర్‌ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో  విశ్లేషకుల అంచనాలను అధిగమించి ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. ఐటీసీ ఆదాయం 5.7 శాతం పెరిగి రూ.9522 కోట్లకు  చేరింది. గత సంవత్సరంతో రూ .9248 కోట్ల ఆదాయాన్ని సాధించింది.  నికర లాభం 17 శాతం పెరిగి 3,090 కోట్ల రూపాయలుగా నమోదైంది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికరలాభం 2,647 కోట్ల రూపాయలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  అయితే  సిగరెట్ల ఆదాయం మాత్రంక్షీణించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 10 శాతం పుంజుకుని రూ. 3904 కోట్లను తాకగా.. మార్జిన్లు 38 శాతం నుంచి 40 శాతానికి ఎగశాయి.
 
ఇయర్‌ ఆన్‌ ఇయర్‌   సిగరెట్ల అమ్మకాల 44శాతం  తగ్గాయి. తద్వారా రూ. 4629 కోట్లు లభించినట్లు కంపెనీ పేర్కొంది.  అగ్రి బిజినెస్  కూడా 8.44 శాతం తగ్గి రూ .1,530.86 కోట్లకు పడిపోయింది. అయితే  పేపర్‌, ప్యాకేజింగ్ వ్యాపారాలు 4.20 శాతం పెరిగి 1,279.6 కోట్లకు తగ్గాయి. దీంతో  వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం దాదాపు 27 శాతం క్షీణించి రూ. 9,772 కోట్లకు చేరింది.
 

మరిన్ని వార్తలు