ITC: రూ. 1500 కోట్ల పెట్టుబడిపై 'శివరాజ్ సింగ్ చౌహన్' ఏమన్నారంటే?

4 Sep, 2023 11:53 IST|Sakshi

సెహోర్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ & స్థిరమైన ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు 'ఐటిసి' తాజాగా వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం వల్ల.. రాష్ట్రంలో వ్యవసాయ, తయారీ రంగాలకు మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శివరాజ్ సింగ్ చౌహాన్' ఈ ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. బడియాఖేడిలోని రెండు కర్మాగారాలకు భూమి పూజ జరిగింది. ఇక్కడ దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి జరగబోతోంది, దీని వల్ల దాదాపు 5000 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.

మనం పండించే ప్రతిదానికి ఇక్కడే సరైన ధర లభించేలా.. మన పిల్లలకు ఇక్కడే ఉపాధి కల్పించేలా చేయడమే లక్ష్యమని కూడా శివరాజ్ తెలిపారు. వ్యవసాయానికి పరిమితులున్నాయి, కావున శాశ్వత ఉద్యోగావకాశాలు లభించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. దీని కోసం పెట్టుబడులను తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు.

ఇదీ చదవండి: చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్‌బీఐ రూల్స్ ఇలా..

ఐటీసీ కంపెనికి చెందిన ఫుడ్ ప్లాంట్ ఆటా బ్రాండ్ ఆశీర్వాద్.. సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఇప్పీ నూడిల్స్ కోసం ఉత్పత్తులు తయారు చేస్తోంది. అంతే కాకుండా స్థిరమైన ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా ఉంటుందని, ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్యాకేజింగ్, ఫుడ్ అండ్ డ్రింకింగ్ రంగం వంటి రంగాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా ITC ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్స్ అండ్ అగర్బత్తీల కోసం సహ తయారీ యూనిట్లతో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది.

మరిన్ని వార్తలు