మారుతి ఎర్టిగా బుకింగ్స్‌ నేటి నుంచే

14 Nov, 2018 12:38 IST|Sakshi

నవంబరు 21న ఎర్టిగా (ఎంపీవీ) 2018 లాంచ్‌

ప్రీ బుకింగ్స్‌ నేటి నుంచే ప్రారంభం

రూ.11వేలతో కొత్త ఎర్టిగా బుకింగ్‌

సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్‌ మోడల్‌ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్‌ చేయనుంది. సెవన్‌ సీటర్‌ మల్టీ పర్సస్‌ వెహికల్‌ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్‌ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది.  ఈ న్యూ ఎర్టిగా  ఎల్‌, వీ, జెడ్‌, జెడ్‌ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో  ఈనెల 21న లాంచ్‌ చేయనుంది.  అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు.

ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్‌  సందర‍్భంగా  మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్‌ ఎర్టిగాతో  పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా.  రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ)  మధ్య  ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  ఎర్టిగా  2018 ( ఎంపీవీ) 1.5 లీటర్‌ పెట్రోలు ఇంజీన్‌, 1.3 లీటర్‌ డీజిల్‌ రెండు వెర్షన్‌లలో, అయిదు రంగుల్లో  లభ్యంకానుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు