మీడియా షేర్ల లాభాల 'షో'

22 Jun, 2020 13:35 IST|Sakshi

మీడియా ఇండెక్స్‌ 2.5 శాతం ప్లస్‌

పలు షేర్లు 7-2 శాతం మధ్య అప్

‌ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్లూ జోరు

లాభాలతో కదులుతున్న మార్కెట్లలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో మీడియా ఇండెక్స్‌ 2.5 శాతం పుంజుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో పలు కౌంటర్లు 7-2 శాతం మధ్య ఎగశాయి. దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌ ఎత్తివేయనున్న నేపథ్యంలో తిరిగి మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ బిజినెస్‌లు ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం..

డీబీ కార్ప్‌ జోరు
మీడియా రంగ షేర్లలో ప్రధానంగా డీబీ కార్ప్‌ 7.2 శాతం ఎగసింది. రూ. 78 వద్ద ట్రేడవుతోంది.  గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 17500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా మూడు రెట్లు అధికంగా 50,000 షేర్లు చేతులు మారాయి. ఇతర కౌంటర్లలో నెట్‌వర్క్‌ 18, డిష్‌ టీవీ, టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌, ఐనాక్స్‌ లీజర్‌, పీవీఆర్‌, జీ, సన్‌ టీవీ, జాగరణ్‌ ప్రకాశన్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఐనాక్స్‌ లీజర్‌ ఈ నెల 26 నుంచి నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌- 100లో చోటు సాధించనుంది.

మరిన్ని వార్తలు