# మీటూ : మరో వికెట్‌ ఔట్‌

29 Oct, 2018 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న  బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్ (55)కు భారీ షాక్‌ తగిలింది. ముఖ్యంగా  పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో  పలువురి గోముఖ వ్యాఘ్రాల బండారం బట్టబయలవుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనుషులపై సంబంధిత చర్యలకు పలు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావడం విశేషం. ఈ క్రమంలో టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్‌  చర్యలకు దిగింది.  లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుహేల్‌ సేథీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. 

టాటా గ్రూపులో ప్రధాన భాగామైన టాటా సన్స్‌ అభివృద్ధిలో కీలక పాత్ర  పోసించిన సేథ్‌తో కలిసి పనిచేయమని తేల్చి చెప్పింది.నవంబర్ 30, 2018 నముగియనుంది కానీ,  నెల రోజుల నోటీసుతో  నెలముందే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టాటా సన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే ఆరోపణలు వెల్లువెత్తిన  సమయం నుంచి టాటా సన్స్‌ కౌన్సెల్‌జీ  అతనితో సంబంధాలను నిలిపివేసినట్టు చెప్పారు.

కాగా ఇటీవల  ఇండియాలో సోషల్‌ మీడియా ద్వారా మీడియా రంగంలో మీటూ ఉద్యమ  ప్రకంపనలు  క్రమంగా అన్ని రంగాల్లోని  ‘పెద్దమనుషు’ల బండారం వెలుగులోకి  వస్తోంది. ఈ క్రమంలోనే సుహేల్‌ సేథ్‌పై కూడా  వరుస ఆరోపణల వెల్లువ కురిసింది.   మోడల్,మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ డియాండ్రా సోర్స్, చిత్రనిర్మాత నటాషా రథోర్,  జర్నలిస్టు  మందాకిని గెహ్లాట్‌, రచయిత ఇరా త్రివేదిలతో సహా ఆరుగురు  మీటూ పేరుతో సేథ్‌ పై ఆరోపణలు  గుప్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు