మోటో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

11 Apr, 2018 18:01 IST|Sakshi

మోటో  డే సేల్‌

గరిష్టంగా రూ.8వేలు డిస్కౌంట్‌

ఏప్రిల్ 12-14 వరకు ఈ స్పెషల్‌ సేల్‌

సాక్షి, ముంబై:  మోటరోలా ఇండియా కూడా  మోటో డే సేల్‌ ను ప్రారంభించింది. ఈ స్పెషల్‌ సేల్‌లో  మూడు స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను  అమలు చేస్తోంది. ఆన్‌లైన్‌ రీటైల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్‌  ఏప్రిల్‌ 12 నుంచి 14వరకు అందుబాటులో ఉంటుంది. మోటో ఎ‍క్స్‌ 4, ఈ4 ప్లస్‌, జెడ్‌ 2 ప్లే స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా రూ.8వేల దాకా రాయితీ ధరలను ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఈ సేల్‌ ప్రారంభమవుతుంది.

మోటో ఈ 4ప్లస్ 3జీబీ ర్యామ్‌ (ఫైన్ గోల్డ్, ఐరన్ గ్రే) రూ. 8,999 లకే లభ్యం. దీని అసలు ధర రూ. 9,999గా ఉంది. మోటో జెడ్‌  2 ప్లే  భారీగా 8,000 రూపాయలు డిస్కౌంట్‌ అనంతరం  రూ. 19,999కే  అందుబాటులో ఉంది. మోటో ఎక్స్‌ 4  (3జీబీ / 4జీబీ / 6జీబీ   ర్యామ్‌ ) అన్ని  వేరియంట్స్‌  లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఖచ్చితమైన ఆఫర్ ఇంకా బహిర్గతం చేయలేదు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లపై ఎక్సేంజ్‌ ఆఫర్‌  కూడా ఉంది.

మరిన్ని వార్తలు