ఆన్‌లైన్‌లో ఏవి ఎక్కువ కొంటున్నారంటే..

22 Oct, 2023 20:33 IST|Sakshi

పండుగ సీజన్‌లో ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు ఆఫర్లు ప్రకటించాయి. అయితే కొందరు వారి ఆర్థికస్థోమత తగినట్లు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొనే వస్తువులకు సరిపడా డబ్బు లేకపోయినా అప్పుచేసి మరీ వాటిని తీసుకుంటాం. అయితే కొంచెం ఆలస్యం అయినా ఎక్కువ మంది భారతీయులు ప్రీమియం వస్తువులనే తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందులో అధికంగా డిమాండ్‌ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం.

ఆఫర్‌ సీజన్‌లో మొబైల్ ఫోన్‌ల కొనుగోళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారీ దాని ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ వస్తువులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రెండు వర్గాలలోనూ ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తుంది. 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ దశలో సేల్ ప్రారంభమైన మొదటి గంటలో సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేశారు. మొదటి 48 గంటల్లో విక్రయించిన ప్రతి ఐదు స్మార్ట్‌ఫోన్‌లలో నాలుగు 5జీ మోడళ్లు అని సర్వే తెలిపింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు గత ఏడాదితో పోలిస్తే 3 రెట్లు వృద్ధిని సాధించాయి. ల్యాప్‌టాప్‌లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం అధికంగా అమ్ముడయ్యాయి. 

ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్‌ల విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో పోలిస్తే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 1.7 రెట్లు పెరిగింది. పండగ సీజన్ అమ్మకాల్లో భాగంగా 15లక్షల ఐఫోన్‌లను విక్రయించారు. 

ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన ఆఫర్‌ల కారణంగా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు