మోటో జీ5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌: రేపే ఆఖరు

4 Jan, 2018 19:37 IST|Sakshi

సాక్షి, ముంబై: మోటో జీ  5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ లభిస్తోంది.  ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ మోటరోలా..మోటో జీ సిరీస్‌లో భాగంగా  గత ఏడాది లాంచ్‌  చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇపుడు   రూ.5వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  20  మొబైల్స్‌, 18 బొనాంజా పేరుతో జనవరి 3-5వరకు  పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌  లభిస్తోంది.

 ఈ తాజా తగ్గింపుతో మోటరోలా ట్విట్టర్‌ సమాచారం ప్రకారం ఐదో జనరేషన్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5 ప్లన్ ఇపుడు రూ 9,999 లభ్యం. ఈ ఆఫర్‌ జనవరి 5వ తేదీవరకుమాత్రం అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ లో సమాచారం 32జీబీ స్టోరేజ్‌ మోటో జీ 5 ప్లన్  స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7వేల తగ్గింపుతో 9,999కే అందిస్తోంది. దీని అసలు ధరను రూ.16,999.  

మోటో జీ 5 ప్లన్  ఫీచర్లు

5.2 అంగుళాల టచ్‌స్క్రీన్ 
2 గిగాహెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్
ఆక్టా-కోర్ ప్రాసెసర్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ 

 మరోవైపు ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న మోటో ఈ4 ప్లస్‌ అమెజాన్‌లోకూడా ఇపుడు అందుబాటులోకి వచ్చింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు