ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత

17 Nov, 2016 00:52 IST|Sakshi
ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత

ఈ ఏడాది 8-10 శాతానికి కుదించిన నాస్కామ్

 న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ సమాఖ్య సాస్కామ్ తాజాగా 2016-17 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించింది. వీటిని 8-10 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ వంటి అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా నాస్కామ్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ సాఫ్ట్‌వేర్ సర్వీసుల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఇక 2016-17కి సంబంధించి పెరిగే ఆదాయం 8-10 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది.

ఇది 2015-16లో 10 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి పలు అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. ఇక ఐటీ కంపెనీల ఆదాయంలో స్తబ్దత నెలకొని ఉండటంతో వృద్ధి రేటు 1-2 శాతం పారుుంట్లు మేర తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డారుు. కాగా ఎగుమతుల ఆదాయ వృద్ధి (స్థిర కరెన్సీ పరంగా) 2015-16లో 12.3 శాతంగా నమోదరుు్యంది.

మరిన్ని వార్తలు