మహీంద్రా మరాజో ఎమ్‌పీవీ లాంచ్‌

3 Sep, 2018 12:20 IST|Sakshi

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ విడుదల

నాలుగు వేరియంట్లో లభ్యంబుకింగ్స్‌ ప్రారంభం​

మారుతి ఎర్టిగా, ఇన్నోవా క్రిస్టా,  టాటా హెక్సాకు పోటీ

మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా మరాజొ ఎమ్‌పీవీ వెహికల్‌ను  సోమవారం లాంచ్‌ చేసింది.  2002 లాంచ్‌ మహీంద్రా  స్కార్పియో లానే  మరాజో వాహనం విడుదల కూడా కీలకమైన  మైలురాయి అని కంపెనీ వ్యాఖ్యానించింది.  ఉత్తర అమెరికాలోని   డిట్రాయ్ సమీపంలోని  టెక్నికల్ సెంటర్, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఇంజీన్‌ను,  ఇటాలియన్ డిజైన్ హౌస్ పినిఇన్‌ ఫెరీరా భాగస్వామ్యంతో మరాజొ డిజైన్‌ను రూపొందించినట్టు తెలిపింది. ఇండియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లు ఇప్పటికే  బుకింగ్స్‌ ప్రారంభించారని తెలిపింది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ
1.5 లీటర్ సామర్థ్యం గల ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజీన్‌,  6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ , 120బిహెచ్‌పి పవర్,  300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.  మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ,  రివర్స్ పార్కింగ్ లాంటి ప్రధాన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7 అంగుళాల  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , పియానో బ్లాక్ డ్యాష్‌బోర్డ్,  బీజీ కలర్ ఇంటీరియర్ ఎలిమెంట్లు ఉన్నాయి.  
 
మొత్తం నాలుగు వేరియంట్లలో(ఎం2, ఎం4, ఎం6, ఎం8) మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీని అందుబాటులోకి తెచ్చింది. వీటి  ధరల శ్రేణి ఎం2 వేరియంట్‌ రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం. ఎం8 ధర రూ.13.90 లక్షలు  (ఎక్స్-షోరూమ్‌)గా నిర్ణయించింది.

మరాజొ అంటే  స్పానిష్‌లో షార్క్ చేప రూపం అనే అర్థం వస్తుంది. దీనికి తగ‍్గట్టుగానే ఈ వాహనాన్నిడిజైన్‌ చేసింది.  కాగా  దేశీయ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా, టాటా హెక్సా మోడళ్లకు మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ  గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు