మహీంద్రా కార్ల అమ్మకాల జోరు

1 Nov, 2023 21:40 IST|Sakshi

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ వాహన విక్రయాల్లో వృద్దిని నమోదు చేసింది. అక్టోబర్‌ నెలలో మహీంద్రా మొత్తం 43,708 ఎస్‌యూవీ వెహికల్స్‌ను అమ్మింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతం వృద్దిని సాధించింది. 

గత ఏడాది ఇదే కాలంలో 32,298 యూనిట్లను విక్రయించింది. 1,854 యూనిట్ల ఎస్‌యూవీలను ఎగుమతి చేయగా.. 25,715 యూనిట్ల వాణిజ్య వాహనాలను అమ్మనిట్లు తెలిపింది

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘అక్టోబర్‌లో 32 శాతం వృద్ధితో 679,32 వాహనాలతో అత్యధిక అమ్మకాలు జరిపాం. వరుసగా మూడో నెలలో ఎస్‌యూవీలు 43,708, సీవీలు 25,715 వాహనాలతో హై వాల్యూమ్‌లు సాధించాయి.’అని అన్నారు. కాగా, మహీంద్రా 2026 నాటికి ఐదు డోర్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ ఎస్‌యూవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. 

మరిన్ని వార్తలు