అలా అయితే... పాన్‌కు తండ్రి పేరు అక్కర్లేదు

21 Nov, 2018 00:12 IST|Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌)కు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి తల్లే సింగిల్‌ పేరెంట్‌ అయితే, సంబంధిత వ్యక్తి పాన్‌ దరఖాస్తులో తండ్రిపేరు అక్కర్లేదు. ఆదాయపు పన్ను నిబంధనలను సవరిస్తూ, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

సవరణలకు అనుగుణంగా దరఖాస్తులో మార్పూ ఉంటుంది. దరఖాస్తుదారుడు తల్లిపేరు మాత్రమే సమర్పించడానికి ఈ తాజా దరఖాస్తు వీలు కల్పిస్తుంది. తాజా నిబంధన డిసెంబర్‌ 5వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం పాన్‌ జారీకి తండ్రి పేరు సమర్పించడం తప్పనిసరి. కొన్ని వర్గాల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజా మార్పులు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వార్షికంగా రూ.2.5 లక్షలు ఆపైన ఆర్థిక లావాదేవీలు కలిగినవారు తప్పనిసరిగా పాన్‌ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యాపార అవకాశాలకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

భారత్‌లో గో జీరో మొబిలిటీ బైక్‌లు

రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు: ఒడిషా

అపోలో ‘సొసైటీ క్లినిక్స్‌’

11,500 పాయింట్లపైకి నిఫ్టీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల వాయిదా