-

నేటి నుంచే వన్‌ప్లస్‌ 6 రెడ్‌ ఎడిషన్‌ సేల్‌

16 Jul, 2018 12:15 IST|Sakshi
వన్‌ప్లస్‌ 6 రెడ్‌ ఎడిషన్‌

వన్‌ప్లస్‌ 6 రెడ్‌ ఎడిషన్‌ నేటి నుంచి తొలిసారి విక్రయానికి వచ్చింది ఈ నెల ప్రారంభంలోనే ఈ కొత్త వేరియంట్‌ రూ.39,999కు లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్‌తో కలిపి, మొత్తం నాలుగు వేరియంట్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వన్‌ప్లస్‌ 6 రెడ్‌ ఎడిషన్‌తో పాటు కంపెనీ అవెంజర్స్‌ స్పెషల్‌ ఎడిషన్‌ వన్‌ప్లస్‌ 6ను లాంచ్‌ చేసింది. ఆ స్పెషల్‌ ఎడిషన్‌ కొన్ని విక్రయాల అనంతరం నిలిపివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్‌ 6 రెడ్‌ విక్రయానికి వచ్చింది. అమెజాన్‌ ఇండియా, వన్‌ప్లస్‌ స్టోర్‌లో ఇది రూ.34,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ 6 రెడ్‌ విక్రయంతో పాటు అమెజాన్‌ ఇండియా ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహిస్తోంది.  

వన్‌ప్లస్‌ 6 రెడ్‌ ఎడిషన్‌ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
2.8 గిగాహెడ్జ్‌ 
డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్‌ఓఎస్‌ 5.1 
6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌, కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ షూటర్‌
7.7 ఎంఎం పలుచనైది, 177 గ్రాముల బరువుంది
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

  • ఆప్టికల్‌ కోటింగ్‌, ఆరు గ్లాస్‌ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. 
  • టాప్‌ గ్లాస్‌ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్‌ లేయర్‌ ఉంది. 
  • రెడ్‌తో మెటాలిక్‌ రెడ్‌ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది
  • మిర్రర్‌ మాదిరి ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, సిల్వర్‌ కెమెరా లెన్స్‌
  • వన్‌ప్లస్‌ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్‌ 6 పేరొందింది. ఈ డివైజ్‌ లాంచ్‌ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది.  
మరిన్ని వార్తలు