ఈ ఏడాది కనిష్ట స్థాయికి పెట్రో ధరలు

29 Dec, 2018 15:56 IST|Sakshi

సాక్షి, ముంబై: చమురు ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా పెట్రోలు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలుపడిపోవడంతో ఇటీవల బాగా దిగివ వచ్చిన పెట్రోలు డీజిలు ధరలు శనివారం 2018 కనిష్టానికి చేరాయి. ఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నైతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దిగి వస్తున్నాయి. లీటరుకు 30పైసలు చొప్పున పెట్రో ధరలు తగ్గాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్‌సైట్‌ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .69.26గా ఉంది. డీజిలు ధర రూ. 63.32గా ఉంది.
ముంబై: పెట్రోలు ధర రూ.రూ. 74.89 , డీజిలు ధర రూ.66.25
చెన్నై : పెట్రోలు ధర రూ.71.85 డీజిలు ధర రూ. 66.84
కోలకతా: పెట్రోలు ధర రూ. రూ. 71.37, డీజిలు ధర రూ. 65.07
హైదరాబాద్‌: పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్‌ ధర రూ.68.82
విజయవాడ: పెట్రోలు ధర రూ. 72.93, డీజిల్‌ ధర రూ.67.97

చమురు ధరల సెగతో ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు రూ.83.22 రూపాయలు, లీటరు రూ.90.57 రూపాయలుగా నమోదయ్యాయి. అయితే గ్లోబల్‌గా  మళ్లీ ముడి చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా 20శాతం దిగి వచ్చిన ఇంధన ధరలు ఏడాదిన్నర కనిష్టాన్ని తాకాయి.  అలాగే డిసెంబరు 24న ఢిల్లీలో పెట్రోధర (జనవరి తరువాత) తొలిసారిగా 70 రూపాయల దిగువకు చేరింది.

మరిన్ని వార్తలు