టీ–రెరా గడువు పొడిగింపు 

8 Dec, 2018 02:24 IST|Sakshi

రూ.లక్ష జరిమానాతో ఈనెల 15 వరకూ నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును పొడిగించారు. రూ.లక్ష జరిమానాతో ఈనెల 15 వరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. 15 వరకు కూడా నమోదు చేసుకోని పక్షంలో జరిమానాను మరింత పెంచుతామని.. ఆ తర్వాత ఏకంగా ప్రాపర్టీలను సీజ్‌ చేస్తామని చెప్పారు. వాస్తవానికి టీ–రెరాలో రిజిస్ట్రేషన్‌ గడువు నవంబర్‌ 30తో ముగిసింది. డిసెంబర్‌ 1 నుంచి 7 వరకు రూ.50 వేల జరిమానాతో రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చారు. 

ఠి 2017, జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కాలంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్‌ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో పరిధిలోకి వస్తాయి. 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్‌ టీ–రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. ఆగస్టు 31 తర్వాత అనుమతి తీసుకున్న ప్రాజెక్ట్‌లు మాత్రం జరిమానా లేకుండానే టీ–రెరాలో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు