26 నెలల కనిష్టానికి రూపాయి

23 May, 2018 09:49 IST|Sakshi

సాక్షి, ముంబై:  చమురు ధరలు  ఆకాశాన్నంటడంతో రూపాయి మరోసారి నెగిటివ్‌గా ప్రారంభమైంది. డాలరుమారకంలో బుధవారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ  మరింత బలహీనపడింది. మునుపటి ముగింపు  68.04  స్థాయిరనుంచి 0.33 శాతం పడిపోయి 68.29 స్థాయికి చేరుకుంది.   అనంతరం మరింత దిగజారి 68.32 వద్ద 26 నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి 6.3శాతం నష్టాలను చవిచూసింది.

అటుఈక్విటీ మార్కెట్లు కూడా  ఫ్లాట్‌గా ప్రారంభమై,  నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 10500 స్థాయికి దిగువన ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 6.3 శాతం బలహీనపడింది.
10 సంవత్సరాల బాండ్ దిగుబడి  7.827శాతానికి చేరింది. వద్ద ఉంది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్  మే నెల పాలసీ సమావేశం మినిట్స్‌కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు