తిరుపతిలో ఐటీ దాడుల కలకలం

4 Nov, 2023 09:10 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో డాలర్స్‌ గ్రూప్‌పై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. డాలర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సి.దివాకర్‌రెడ్డి కార్యాలయం పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దివాకర్‌రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పత్రాలను పరిశీలిస్తున్నారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం మొదలైన ఐటీ అధికారుల సోదాలు రాత్రి తర్వాత కూడా కొనసాగాయి. గురువారం రాత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్‌ నివాసంలోనూ తనిఖీలు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సాధా రణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్లలో సోదాలు చేపట్టినట్టు, కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరి శీలించి వెళ్లినట్టు సమాచారం.

గురువారం రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ ఆర్‌)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో,  బాలా పూర్‌లోని బడంగ్‌పేట్‌ మేయర్, పీసీసీ నేత, చిగు రింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ అధికా రులు సోదాలు చేప ట్టిన విషయం తెలిసిందే. కాగా కేఎల్‌ఆర్‌ నివాసం,కార్యాలయాల్లో శుక్రవారం మరో సారి తనిఖీలు చేపట్టారు.

15 మంది అధికారులు తుక్కుగూడలోని కేఎల్‌ఆర్‌ నివాసానికి చేరుకున్నారు. పలు డాక్యు మెంట్లతో పాటు కేఎల్‌ఆర్‌ను వెంటబెట్టుకుని నార్సింగ్‌ ఎన్‌సీసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. గంట పాటు అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి మాదాపూర్‌లోని కేఎల్‌ఆర్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి  పొద్దు పోయే దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో గురువారం రాత్రే సోదాలు ముగిశాయి.

ఇంట్లో లభించిన రూ.8 లక్షలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.   

మరిన్ని వార్తలు