శాంసంగ్ కు మరో షాక్

25 Oct, 2016 10:38 IST|Sakshi
శాంసంగ్ కు మరో షాక్

న్యూయార్క్: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మంటలు చల్లారకముందే మరో షాక్ తగిలింది. అదే కంపెనీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ కూడా పేలిపోయింది. అమెరికాలోని ఓ వ్యక్తి దగ్గరున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ పేలిందని  స్థానిక మీడియా వెల్లడించింది. చార్జింగ్ పెడుతుండగా ఫోన్ పేలిపోయిందని 'ఫోన్ ఎరినా' పేర్కొంది. ఒరిజినల్ చార్జర్ తో రాత్రంతా పెట్టడంతో ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాలని తెలిపింది. రెండు వారాల క్రితమే శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడని వెల్లడించింది. ఇందులో బ్యాటరీ సురక్షితమైందని కంపెనీ తనకు భరోసాయిచ్చిందని బాధితుడు చెప్పాడు.

కాగా, శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో దావాలు వేశారు. శాంసంగ్ నోట్ 7 మోడల్ ను నిలిపివేయడం.. ఈ ఫోన్లను మార్చుకోవాలని కోరడంతో తాము ఇబ్బందులకు, మానసిక కుంగుబాటుకు గురయ్యామని న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్ కు వచ్చ ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా.

మరిన్ని వార్తలు