సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్లో అసాధ్యం: మారుతీ

5 Nov, 2016 01:38 IST|Sakshi
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్లో అసాధ్యం: మారుతీ

న్యూఢిల్లీ: గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై అత్యంత ఆశావహంగా ఉంది. వాహన కంపెనీలు పూర్తిస్థారుు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మార్కెట్‌లోకి తేవటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారుు. అరుుతే ఈ అటానమస్ కార్లు భారత్‌లో నడిచే అవకాశం లేదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.ఎస్.భార్గవ తెలిపారు. ‘సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అంటేనే నిబంధనల ప్రకారం నడిచేవి. కానీ దేశంలో ఎంత మంది డ్రైవింగ్ నిబంధలను పాటిస్తూ వాహనాలను నడుపుతున్నారు?

కస్టమర్ ప్రవర్తనను అంచనా వేసే టెక్నాలజీతో ఒక ఉపకరణాన్ని ఎలా రూపొందిస్తాం? కస్టమర్ నడవడికను, వైఖరిని ఎవరైనా అంచనా వేయగలరా?’ అని ప్రశ్నించారు. ఇక్కడి డ్రైవింగ్ స్థితిగుతులకు సెల్ఫ్ టెక్నాలజీ అనుకూలం కాదని పేర్కొన్నారు. అరుుతే భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో నడిచే వాహనాలు తిరుగుతుంటే చూడాలని ఉందన్నారు. అలాగే ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్ల వల్ల కార్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇలాంటి కంపెనీలు భవిష్యత్తులో అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు