లాభాల షురూ : తప్పని ఊగిసలాట

15 May, 2019 10:06 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నిన్నటి లాభాల ముగింపును కొనసాగిస్తూ బుధవారం  లాభాలతో ఉత్సాహగా ప్రారంభమైనాయి.  ఆరంభంలో డబుల్‌ సెంచరీకిపైగా లాభాలతో కొనసాగినా  తర్వాత ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 83 పాయింట్లు ఎగసి 37,407వద్ద,  నిఫ్టీ 24 పాయింట్లు పుంజుకుని 11,246 వద్ద ట్రేడవుతోంది.

ప్రధానంగా రియల్టీ, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్‌, ఐటీ, మెటల్‌, ఫార్మా  లాభపడుతున్నాయి.ఐవోసీ, బీపీసీఎల్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఐషర్, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో లాభపడుతుండగా, యస్ బ్యాంక్‌, జీ, ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, కోల్‌ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో  నష్టపోతున్నాయి.  మరోవైపు డిప్యూటీ సీఈవో రాజీనామాతో నిన్న 13శాతం కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌, సీఈవో వినయ్‌దుబే, హెచ్‌ఆర్‌ హెచ్‌ రాహుల్‌ తనేజా   కూడా కంపెనీకి గుడ్‌ బై చెప్పారన్న వార్తల నేపథ్యంలో బుధవారం 4శాతం నష్టాలతో కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు